ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్‌లను ఆ సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామోజీరావు..

by Kavitha |
ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్‌లను ఆ సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీకి  పరిచయం చేసిన రామోజీరావు..
X

దిశ, సినిమా: మీడియా దిగ్గజం రామోజీరావు నేడు(శనివారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ళ వయసులో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మీడియా రంగంలోనే కాదు సినిమా రంగంలో కూడా రామోజీ రావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు నిర్మించి ఆయన ఎందరో నూతన దర్శకులు, నటీనటుల్ని ప్రోత్సహించారు.





1984లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవారి ప్రేమ లేఖ’ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీరావు నిర్మాతగా మారారు. నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. 2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా జోరు పెంచిన ఆయన కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత అతనికి దక్కుతుంది. నూతన దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ లను పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘చిత్రం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తరుణ్ ని సైతం హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీ రావే. ఆయన నిర్మాణంలో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ ను ప్రారంభించినది కూడా రామోజీరావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతోనే. ఆ మూవీతోనే ఎన్టీఆర్ హీరో అయ్యారు.


అదేవిధంగా హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లని కూడా రామోజీ రావు పరిచయం చేశారు. రీమా సేన్, రిచా పల్లోడ్, స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ వంటి వారు కూడా రామోజీరావు నిర్మాణంలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.


Advertisement

Next Story