బేబీ పుట్టాక నేను ఉండేది అక్కడే.. ఉపాసన కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-16 05:47:00.0  )
బేబీ పుట్టాక నేను ఉండేది అక్కడే.. ఉపాసన కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన రామ్ చరణ్, ఉపాసన కొంత కాలంగా అందులోనే నివాసం ఉంటున్నారు. అయితే.. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఓ నిర్ణయం తీసుకున్న ఉపాసన తాము త్వరలో మళ్ళీ అత్తమావయ్యలతో కలిసి ఉండబోతున్నామ్ అని క్లారిటీ ఇచ్చింది.

ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ ప్రమేయం చాలా ముఖ్యం. మన గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ, అభిమానాలు మనకు ఎప్పుడూ తోడుగా ఉండాలి. అది నా బిడ్డకు కూడా దక్కాలి. అందుకే అత్తమావయ్యలతో కలిసి ఉండాలని చరణ్, తాను నిర్ణయించుకున్నట్లు ఉపాసన పేర్కొంది. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగితే వాళ్లలో చాలా ఉన్నత లక్షణాలు అలవడతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన పేర్కొంది. దీంతో ఉపాసనాపై మరింత అభిమానం పెరిగిపోతుంది మెగా అభిమానులకు.

Read more: ఆ వీడియోను పోస్ట్ చేసిన శ్రీజ.. భర్తను వదిలేసి తండ్రి సంపాదనతో ఫుల్ ఎంజాయ్ చేస్తుందంటూ కామెంట్స్

Advertisement

Next Story