‘రామబాణం’ అందరినీ అలరించే ఎంటర్‌‌టైనర్‌ : డింపుల్ హయతి

by Anjali |   ( Updated:2023-04-25 13:54:08.0  )
‘రామబాణం’ అందరినీ అలరించే ఎంటర్‌‌టైనర్‌ : డింపుల్ హయతి
X

దిశ, సినిమా: గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమాలో డింపుల్ హయతి కథానాయికగా నటించింది. కాగా మే 5న విడుదల కాబోతున్న సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది బ్యూటీ. ‘‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నపుడే దీనికి సైన్ చేశాను. నా పాత్ర పేరు భైరవి.

అందరినీ అలరించే ఎంటర్‌టైనర్ ఇది. గోపీచంద్‌ జెంటిల్ మెన్. జగపతి బాబు, ఖుష్బూ లాంటి సీనియర్లతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. ఈ ప్రయాణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మళ్లీ పనిచేయాలని ఉంది. మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

మగాళ్లకే కాదు.. మహిళల్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి: తాహిరా

Advertisement

Next Story