రియాల్టీ తెలిసేలోపు మునిగిపోతారు.. మెగాస్టార్‌కు సెన్సేషనల్ డైరెక్టర్ సూచన

by GSrikanth |   ( Updated:2023-08-12 12:15:15.0  )
రియాల్టీ తెలిసేలోపు మునిగిపోతారు.. మెగాస్టార్‌కు సెన్సేషనల్ డైరెక్టర్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు(ఆగస్టు 11) విడుదలైంది. చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. దర్శకుడిగా మెహెర్ రమేశ్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడని మండిపడుతున్నారు. సినిమా చూసిన అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవిపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘‘జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు.. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’’ అని ట్విట్టర్ వేదికగా మెగాస్టార్‌కు రామ్ గోపాల్ వర్మ కీలక సూచనలు చేశారు.

Read More: ‘భోళా శంకర్’ లో శ్రీముఖితో ఆ సీన్ (వీడియో).. రజినీ కాంత్‌ను చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

‘భోళా శంకర్’ పర్‌ఫెక్ట్ రివ్యూ.. (వీడియో)

Advertisement

Next Story