ధోనీతో రామ్ చరణ్ అదిరిపోయే స్టిల్.. నెట్టింట ఫోటో వైరల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-05 06:29:16.0  )
ధోనీతో రామ్ చరణ్ అదిరిపోయే స్టిల్.. నెట్టింట ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో ఉన్న కొత్త పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు ‘సో హ్యపీ టు మీట్ ఇండియాస్ ప్రైడ్’ అని కామెంట్ పెట్టారు. ఈ ఫోటోలో ధోనీ తన కొత్త హేయిర్ స్టైల్‌తో మెరిసిపోయారు. బ్లూ కలర్ టీ షర్ట్, కార్గో ప్యాంట్‌‌లో ధోనీ కనిపించారు. ఇక రామ్ చరణ్ ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్, దానికి మ్యాచింగ్ ప్యాంట్‌లో కూల్ గ్లాసెస్ పెట్టుకుని కనిపించారు. ఇక చెర్రీ పోస్ట్ చేసిన ఫోటో చూసిన సినిమా, క్రికెట్ అభిమానులు ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరిని చూడటం ఆనందంగా ఉందంటున్నారు.

మరో నెటిజన్ ‘ఇద్దరు వారి వారి రంగాల్లో రారాజులు అంటూ కామెంట్’ చేశాడు. ఇక, బుధవారం రామ్ చరణ్ ముంబాయిలోని సిద్ధివినాయక టెంపుల్‌ని దర్శించుకున్నారు. అయితే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వాణీ మరోసారి చెర్రీకి జతగా నటించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో విడుదల కానుంది. ఎస్ జే సూర్య, జయరాం, అంజలి, శ్రీకాంత్‌లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ధోనితో రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read More: చైతన్యకు రెండో పెళ్లి? చరణ్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక?

Advertisement

Next Story