Ram Charan కూతురితో మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిందిగా.. ఏకంగా అన్ని కోట్ల లాభాలా?

by samatah |   ( Updated:2023-08-05 03:55:18.0  )
Ram Charan కూతురితో మెగా ఫ్యామిలీకి  కలిసొచ్చిందిగా.. ఏకంగా అన్ని కోట్ల లాభాలా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పెళ్లైన పది సంవత్సరాల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట సందడి మొదలైంది. చరణ్ కూతురికి క్లీం కారా అంటూ పేరు కూడా పెట్టుకొచ్చారు. ఇక చెర్రీకి కూతురు పుట్టాక కలిసొచ్చిందంట.

మెగా మనవరాలు ఇంటికి వచ్చిన వేళా విశేషం మెగాస్టార్ చిరంజీవికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా 2000 కోట్లు లాభాలు వచ్చాయి . దానికి కారణం రీసెంట్ గానే కోకాపేటలో ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడమే. ఏకంగా అక్కడ ఎకరం భూమి ధర 100 కోట్లు పలుకుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇది ఓ సంచలనం అని బిజినెస్ నిపుణులు చెప్పుకొస్తున్నారు . అయితే మెగాస్టార్ చిరంజీవికి కోక పేటలో అన్ అఫిషియల్ రికార్డు లెక్కల ప్రకారం 30 ఎకరాల భూమికి పైగానే ఉందట . ఈ లెక్కలు చూసుకుంటే చిరంజీవికి సడన్గా 2000 కోట్లు విలువ చేసే లాభాలు వచ్చినట్లే అంటున్నారు సినీ ప్రముఖులు. దీంతో మెగా మనవరాలు మెగా ఫ్యామిలీకి మరింత లక్కీగా మారిపోయింది.

Also Read: తండ్రి కాబోతున్న యంగ్ హీరో Sharwanand?

Advertisement

Next Story