తండ్రి కాబోతున్న Ram Charan.. అధికారికంగా ప్రకటించిన Chiranjeevi

by sudharani |   ( Updated:2022-12-15 06:37:56.0  )
తండ్రి కాబోతున్న Ram Charan.. అధికారికంగా ప్రకటించిన Chiranjeevi
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ ఇంట్లో సందడి మొదలయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ''శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు'' అంటూ చిరంజీవి తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కాగా.. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

రామ్ చరణ్-ఉపాసనలకు 2021-06-14 న వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరికి సంతానం లేదు. అయితే ఈ విషయంపై ఎన్నో రూమర్స్ కూడా తలెత్తాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

Read more:

వాయిలెట్ సూట్‌లో వేడెక్కిస్తున్న Sreemukhi.. ఎద అందాలు చూపిస్తూ..

Advertisement

Next Story

Most Viewed