ఆ ట్రాప్‌లో పడొద్దని వరుణ్ తేజ్‌కు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?

by samatah |   ( Updated:2023-08-16 07:17:16.0  )
ఆ ట్రాప్‌లో పడొద్దని వరుణ్ తేజ్‌కు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్?
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిన సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. కాగా తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘నేను నా 7వ సినిమా చేస్తున్న టైంలో రామ్ చరణ్ నాతో ఒక మాట చెప్పారు. కొత్తగా ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం. మనస్సుకు నచ్చిన సినిమా చేయి. భవిష్యత్తులో బిజినెస్, మార్కెట్ పెరుగుతుంది. ఈ సమయంలో చేయి జారితే మళ్లీ అలాంటి సినిమాలు చేయాలంటే సాధ్యం కాదు. అలాగే కొన్ని కథలు చేయాలనిపించినా చేయలేకపోతున్నా అని చరణ్ నాతో అన్నాడు. ఆ ట్రాప్‌లో నువ్వు పడొద్దని చరణ్ సూచనలు చేశారు’ అని వరుణ్ తేజ్ వెల్లడించారు.

Read More : చరణ్ సినిమా నిలిపివేత!

Advertisement

Next Story