Rhyme : రామ్ చరణ్, ఉపాసన దగ్గర ఉన్న పెట్ డాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్..

by Anjali |   ( Updated:2023-04-14 06:37:19.0  )
Rhyme : రామ్ చరణ్, ఉపాసన దగ్గర ఉన్న పెట్ డాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాధారణంగా ఎవ్వరైనా పెట్ డాగ్స్‌ను పెంచుకోవడానికి ఇష్టపడతారు కదా.. అందులో చరణ్, ఉపాసన ఒకటి. వీరిద్దరు కేవలం పెట్స్ లవర్స్ మాత్రమే కాకుండా జంతు ప్రేమికులు కూడా. వీరి ఇంట్లో పెట్ డాగ్ ఉన్న విషయం తెలిసిందే. రైమ్ చిన్నప్పటి నుంచి చరణ్ ఒళ్లోనే పెరిగింది. దానితోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్ చేస్తాడట.

ఆయన విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లిన సరే రైమ్ పక్కన ఉండాల్సిందే. దీనికి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండటమే కాకుండా.. 50 వేలకు పైగా అనుచరులు కూడా ఉండడం విశేషం. అయితే తాజాగా ఈ దంపతులిద్దరు మాల్దీవ్స్ టూర్ నుంచి రాగానే ఎయిర్ పోర్టులో రైమ్ చేసిన హంగామా మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు పెట్ డాగ్ విలువ 35వేల నుంచి 70 వేల మధ్య వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Also read:

ఉపాసనకు రామ్ చరణ్ ఫస్ట్ గిఫ్ట్ ఇదే!

దారుణం.. యువకుడి ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన కుక్క

Advertisement

Next Story