Ram Charan - Upasana: కూతురు ఎన్నివేల కోట్లకు వార‌సురాలో తెలుసా ?

by samatah |   ( Updated:2023-06-22 06:27:09.0  )
Ram Charan - Upasana:  కూతురు ఎన్నివేల కోట్లకు వార‌సురాలో తెలుసా ?
X

దిశ, సినిమా: హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇటు మెగా ఫ్యామిలీ, అటు అభిమానుల పదేళ్ల నిరీక్షణ కాండంతో ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువగా మెగా వారసురాలి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. రీసెంట్‌గా చరణ్ దంపతుల కూతరు ఎన్ని కోట్లకు వారసురాలోననే చర్చలు ఊపందుకున్నాయి. ఒక అంచనా ప్రకారం రామ్ చరణ్-ఉపాసన దంపతుల ఆస్తి విలువ రూ. 2,500 కోట్లు. ఇందులో అధిక భాగం ఉపాసన వాటా ఉంటుంది. మెగా కోడలిగానే కాకుండా ఆమె దోమకొండ సంస్థానం వారసురాలు. పైగా దేశంలో అత్యంత ధనవంతులో ఒకరైనా అపోలో చైర్మెన్ సి.ప్రతాప్ రెడ్డి మనవరాలు కూడాను. ఇక ప్రాతాప్ రెడ్డి ఆస్తి విలువే రూ. 21, 000 కోట్లు. అపోలో గ్రూప్ మార్కెట్ వాల్యూ రూ. 70, 000 కోట్లు ఉంటుంది. వీటన్నిటినీ బట్టి చూస్తే చరణ్‌కి చిరంజీవి ద్వారా వచ్చిన ఆస్తి.. అతను సంపాదించుకున్నదంతా పక్కన పెడితే, ఉపాసన ద్వారా వచ్చే ఆస్తి వేల కోట్లు ఉంటుంది. అందుకే ఇప్పుడు చరణ్ కూతురు ఆస్తి విలువ లెక్క అంచనాలకు అందదు.

Read more:

Ram Charan - Upasana: చరణ్- ఉపాసనల కూతురు ఫొటోపై క్లారిటీ

చిరు మూడో తరంలో ఇంతవరకూ మగ బిడ్డ పుట్టకపోవడానికి కారణం అదేనా?

విజయ్ ‘లియో’.. తెలుగు రైట్స్ రేట్‌ ఎన్ని కోట్లో తెలుసా?

Advertisement

Next Story