ఉపాసనకు ఇప్పుడు ఆరో నెల.. నాబిడ్డనాకు ఇప్పుడే ఇంత అదృష్టం తెస్తుందంటూ..

by samatah |   ( Updated:2023-03-14 05:44:52.0  )
ఉపాసనకు ఇప్పుడు ఆరో నెల.. నాబిడ్డనాకు ఇప్పుడే ఇంత అదృష్టం తెస్తుందంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్కార్ అవార్డ్స్ లో మన తెలుగు చిత్ర పరిశ్రమ తన చరిత్రను లిఖించింది. త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుంది. అటు ఏపీ, ఇటు తెలగాణ ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు.ఇక అస్కార్ అవార్డ్స్ ఫంక్షలో రామ్ చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో ఫంక్షన్‌కు అటెండ్ అయ్యి, అందరి చూపును తమ వైపు తిప్పుకున్నాడు. అలాగే ఉపాసన, రామ్ చరణ్ రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఉపాసన ఇప్పుడు ఆరు నెలల గర్భవతి, పుట్టబోయే బిడ్డకు ఎంతో ప్రేమ లభిస్తుంది. తాను కడుపులో ఉండగానే మాకెంతో సంతోషాన్ని అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అంటూ.. తనకు పుట్టబోయే బిడ్డపై ప్రేమను కురిపించాడు.

Read more:

అస్కార్ అవార్డ్స్‌లో ఉపాసన ఆ చీరే ఎందుకు కట్టుకుందో తెలుసా?

Advertisement

Next Story