మెగా హీరోతో జతకట్టబోతున్న సాయిపల్లవి..!

by Anjali |   ( Updated:2023-11-14 11:43:08.0  )
మెగా హీరోతో జతకట్టబోతున్న సాయిపల్లవి..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ఈ హీరో ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతంగా నటించి.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం చరణ్ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. ఇక దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ భారతీయుడు- 2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉండడంతో ఈ చిత్రం కాస్త ఆలస్యమవుతోంది. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ సినిమాని( RC16 ) మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే చరణ్ హీరోగా.. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. మొదట్లో జాన్వీ కపూర్.. తర్వాత మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ సాయిపల్లవిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ రామ్ చరణ్-సాయిపల్లవి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. ఈ చిత్రంలో నటిస్తే తెలుగులో స్టార్ హీరో సరసన నటించడం ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది. అంటూ సాయిపల్లవి ఫ్యాన్స్ సంతోషంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed