రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అఖిల్‌తో కాదు.. ఆ హీరోతోనే..? ఈరోజే అనౌన్స్‌మెంట్ (వీడియో)

by sudharani |   ( Updated:2023-05-28 06:53:22.0  )
Ram Charanm
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభిస్తున్న విషయం విదితమే. చర్రీ, ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి ‘V MegaPictures’ అనే బ్యానర్‌ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థలో కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సాహిస్తూ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు నిర్మించాలనేది ప్లాన్. ఈ క్రమంలోనే ‘V MegaPictures’ నుంచి మొదటి సినిమాకు ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాంచరణ్ నిర్మాణ సంస్థతో.. అభిషేక్ అగర్వాల్ సంస్థ కూడా జత కానుంది. వీరి కాంబోలో ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఈరోజు ఉదయం 11.11 గంటలకు రాబోతుందని అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా అఖిల్ అక్కినేనితో నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అఖిల్ అక్కినేని మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా చరణ్‌తో సన్నిహితంగా ఉంటారు. ఈ మేరకు తనతోనే రామ్ చరణ్ మొదటి సినిమా ఉండబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక తాజా సమాచారం మేరకు చరణ్ నిర్మించబోయే తొలి సినిమా అఖిల్ అక్కినేనితో కాదు.. నిఖిల్ సిద్దార్థతో ఉండబోతున్నట్లు టాక్. అద్భుతమైన పాన్ ఇండియా కథతో చరణ్.. నిఖిల్ హీరోగా సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. రేపే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి అనౌన్స్‌మెంట్ ఉంటుందని స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. కాగా.. కార్తికేయ-2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో నిఖిల్ ఫుల్ జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే.

Also Read: OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లీష్ మరియు కన్నడ సినిమాలు ఇవే!

Advertisement

Next Story