Ram Charan: షారుఖ్ సినిమాలో రోల్ ఏదయినా సరే.. సై అంటున్న రామ్ చరణ్

by Prasanna |   ( Updated:2023-03-08 09:37:58.0  )
Ram Charan: షారుఖ్ సినిమాలో రోల్ ఏదయినా సరే.. సై అంటున్న రామ్ చరణ్
X

దిశ,వెబ్ డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ రేంజ్లో హైలెట్ అయిన స్టార్ రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ తో సినిమా చేయాలనీ దర్శక నిర్మాతలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మేకర్స్ రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారు . కోలీవుడ్ డైరెక్టర్స్ కథలు రెడీ చేసుకున్నారు. అయితే కొంత మంది దర్శకులు వారి సినిమాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్లో రామ్ చరణ్ తో ఓ కీలక పాత్రను కోసం చర్చలు జరుగుతున్నాయట. పఠాన్ తో సూపర్ హిట్ కొట్టిన ఉన్న షారుఖ్.. ప్రస్తుతం అట్లీతో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉంది. ఆ పాత్ర తమిళంలో విజయ్ చేస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్ తో చేయించడానికి దర్శకుడు నానా ప్రయత్నాలు చేశాడు. ఇక చరణ్నుఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా నుంచి రాగానే అట్లీ చెర్రీని కలిసి కథను చెప్పనున్నారట. తెలిసిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి : SRK ఇంట్లోకి చొరబడిన అభిమానులు.. 8 గంటల పాటు..

Advertisement

Next Story