రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు నన్ను పది సార్లు కొట్టాడు.. నటుడు కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2024-01-27 07:12:21.0  )
రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు నన్ను పది సార్లు కొట్టాడు.. నటుడు  కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా రాబోతున్న చిత్రం రామ్. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌‌లతో అంచనాలు పెంచేశాయి. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జనవరి 23న నిర్వహించారు. అయితే మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు.

తాజాగా, హీరో సూర్య అయ్యలసోమయాజుల ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నవీన్ చంద్ర గ్యాంగులో విలన్ టైపులో కనిపిస్తాను. అమృత్ సర్ షెడ్యూల్‌లో నేను చేశాను. ఓ పదిహేను రోజులు వర్క్ చేశాను. అయితే ఈ క్రమంలో మా నాన్న మరణించాడు. ఆ టైంలో ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ కొడితే పైకి బౌన్స అవ్వాల్సిన షాట్ ఉంటుంది. అలా ఎన్నిసార్లు కొట్టినా కూడా పైకి బౌన్స్ కాలేకపోయాను. అలా ఓ పది టేక్స్ అయ్యాయి.

అలాగే పది సార్లు రామ్ చరణ్ నన్ను కొట్టాడు. కొట్టిన వెంటనే వచ్చి సారీ అని చెబుతూ ఉండేవారు. అలా రామ్ చరణ్ ఎంతో హంబుల్ పర్సన్. తండ్రికి తగ్గ తనయుడు అని నార్మల్‌గా అంటారు.. కానీ తండ్రిని మించిన తనయుడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం గురించి తెలిసిన వారంతా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story