Hero Ram Charan: కంగారూలు, కోలా జంతువులతో ఆడుకుంటున్న రామ్ చరణ్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫొటోలు

by Prasanna |
Hero Ram Charan: కంగారూలు, కోలా జంతువులతో ఆడుకుంటున్న రామ్ చరణ్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న  ఫొటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో మన ముందుకు రానున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లిట్ చేసుకుని ఎడిటింగ్ పనుల్లో బిజిగా ఉంది.

ఈ హీరో ప్రస్తుతం RC16 మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో మనం ఇంత వరకు చూడని రామ్ చరణ్ ని చూడబోతున్నామని సినీ వర్గాల నుంచి సమాచారం.. ఈ మూవీ కొత్త లుక్ కోసం తెగ కష్ట పడుతున్నారు. తాజాగా , రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేసింది. కొద్దీ రోజుల క్రితం చరణ్, ఉపాసన, క్లిన్ కారా ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం మనకీ తెలిసిందే. అక్కడ ఓ ఫిలిం ఫెస్టివల్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ వేడుకకు చరణ్ ఫ్యామిలీతో వెళ్లారు. అప్పటి ఆస్ట్రేలియా ఫోటోలను ఇప్పుడు ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో రామ్ చరణ్ , ఉపాసన ఆస్ట్రేలియాలో ఉండే కంగారూలు, కోలా యానిమల్స్ తో సరదాగా ఆడుకున్నారు. అవి చూడటానికి చాలా బావున్నాయి. అయితే, ఈ ఫొటోల్లో మెగా వారసురాలు క్లిన్ కారా కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story

Most Viewed