హ్యాపి బర్త్‌డే అమేజింగ్ పర్సన్ అంటూ విష్ చేసిన యంగ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
హ్యాపి బర్త్‌డే అమేజింగ్ పర్సన్ అంటూ విష్ చేసిన యంగ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetharamam) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటిస్తూ దూసుకుపోయింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ ఈ అమ్మడుకు ఈ మధ్య హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువవడంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజాగా మృణాల్ ఇన్‌స్టా(Instagram) వేదికగా.. ఒక పర్సన్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. “హ్యాపి బర్త్‌డే అమేజింగ్ పర్సన్.. రేపు చెన్నైలో కలుద్దాం.. నీ పుట్టిన రోజును జరపడానికి ఇంకా నేను వెయిట్ చేయలేను” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.




Next Story

Most Viewed