- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Rashtrapathi Nilayam: రాష్ట్రపతి నిలయంలో.. 28 నుంచి కళా మహోత్సవాలు
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 28 నుంచి.. సికింద్రాబాద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు జరగనున్నాయి.ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు కొనసాగే ఈ ఉత్సవాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయ కార్య నిర్వహణ అధికారి రజనీ ప్రియ వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల యొక్క జీవన విధానం(Way of Life), సంస్కృతి(Culture), సంప్రదాయాలు(Traditions) గురించి తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా 28 న ఉదయం నుంచే పలు రకాల స్టాల్స్(Stalls) అందుబాటులో ఉంటాయని, సాయంత్రం కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈ ఉత్సవాలను సందర్శించాలనుకున్నారు రాష్ట్రపతి నిలయం ఎంట్రీ గేటు వద్ద కౌంటర్ లో వివరాలు నమోదు చేసుకోవాలని లేదా https://rashtrapatibhavan.gov.in వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి" అని ఆమె తెలిపారు.