మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న Ram Charan , Upasana !

by Anjali |   ( Updated:2023-04-12 07:45:49.0  )
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న Ram Charan , Upasana !
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన ఒకటి. ఈ కపుల్స్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషం నెలకొంది. ఈ హీరో సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో... కుటుంబానికీ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. దుబాయ్‌లో తన సన్నిహితులతో కలిసి బేబీ షవర్ వేడుకకు సెలబ్రెట్ చేసుకున్న ఈ కపుల్స్ ఇప్పుడు విహారయాత్రలో బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఈ జంట మాల్దీవ్స్ టూరుకు వెళ్లారు. మండు ఎండల్లో అక్కడ అలలపై దూసుకుపోతోన్న నేచర్‌ను చరణ్ తన సతీమణి ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. దిగిన ఫోటోలను ఈ స్టార్ హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కొద్ది సమయంలోనే తెగ వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి: ఉపాసనకు బిడ్డ పుడితే జరిగేది ఇదేనంట?

Advertisement

Next Story

Most Viewed