రామ్-బోయపాటి ‘స్కంద’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?

by Hamsa |   ( Updated:2023-10-03 12:30:58.0  )
రామ్-బోయపాటి ‘స్కంద’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘స్కంద- ది ఎటాకర్’. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటించగా ప్రముఖయ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా తాజాగా నేడు 28న థియేటర్స్‌లో విడుదలైంది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇందులో రామ్ ఫైట్స్ ఎలివేషన్‌తో పాటు తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయినట్లు సమాచారం. ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్ అని కొందరు అంటున్నారు. రామ్ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. టిపిక‌ల్ మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ టెంప్లేట్ సినిమా ఇద‌ని అంటున్నారు. యాక్ష‌న్ ల‌వ‌ర్స్ కు ఈ సినిమా మంచి ట్రీట్‌లా ఉంటుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కంప్లీట్ ర‌గ్గ్‌డ్ లుక్‌లో రామ్ క్యారెక్టర్, డైలాగ్ డెలివ‌రీ కొత్తగా ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు.

అత‌డిపై వ‌చ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. బోయ‌పాటి శ్రీను త‌న సినిమాల్లో క‌థ‌కంటే మాస్‌, యాక్షన్ అంశాలు, ఎలివేష‌న్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్కంద కూడా అలాగే సాగింద‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు.ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని చెబుతున్నారు. రొమాంటిక్ సీన్స్‌, పాట‌ల్లో రామ్‌, శ్రీలీల కెమిస్ట్రీ ని డైరెక్టర్ బోయపాటి శ్రీను స్క్రీన్ పై బాగా ప్రజెంట్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్‌, శ్రీలీల స్టెప్పులు కూడా ఆక‌ట్టుకుంటాయ‌ని అంటున్నారు. త‌మ‌న్ బీజీఎమ్ మ‌రో బిగ్గెస్ట్ అస్సెట్ అని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. మొత్తానికి ‘స్కంద’ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరీ రామ్, బోయపాటి సూపర్ హిట్ కొట్టి బాక్సాఫీసును బద్దలు కొడతారో చూడాలి.

Advertisement

Next Story