పాకెట్ మనీ కోసం హీరోయిన్‌‌గా మారిన అమ్మాయి.. నేడు 4 భాషల్లో ఫుల్ బిజీ!

by Nagaya |   ( Updated:2023-05-27 13:51:50.0  )
పాకెట్ మనీ కోసం హీరోయిన్‌‌గా మారిన అమ్మాయి.. నేడు 4 భాషల్లో ఫుల్ బిజీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : గత జనరేషన్ ఎలా ఉన్నా.. నేడు నర్సరీ చదివే విద్యార్థికి కూడా పాకెట్ మనీ ఇచ్చి పంపుతున్నారు తల్లిదండ్రులు. ఇతర విద్యార్థుల వద్ద తన బిడ్డ చులకన కావద్దని పర్సు నింపి పాఠశాలకు పంపుతున్నారు. అయితే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు.. పొదుపుగా ఖర్చు చేయకపోతే ఎంతటి నిండు జేబు అయినా ఖాళీ కాకతప్పదు. సరిగ్గా అలాగే జరిగింది ఈ అమ్మాయికి. ఇంటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు సరిపోక ఇంటర్‌లోనే నటిగా మారింది ఈ బ్యూటీ. టైంపాస్‌గా ఓ పది రోజులు నటిస్తే డబ్బులు వస్తాయని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాడు నేడు నాలుగు భాషల్లో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇంతకూ ఆమె ఎవరనుకుంటున్నారు..?



ఆర్మీ కుటుంబానికి చెందిన అమ్మాయి రకుల్ ప్రీతిసింగ్. పూర్వికులది పంజాబీ అయినా ఉద్యోగ రిత్యా తండ్రి ఢిల్లీలో స్థిరపడటంతో రకుల్ దేశ రాజధానిలోనే పుట్టి పెరిగింది. మొదటి నుంచి ఈ కుటుంబంపై ఎలాంటి సినిమాల ప్రభావం లేదు. రకుల్ విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే కొనసాగింది. బాల్యం నుంచి మంచి క్రీడాకారిణి అయిన ఈ పంజాబీ అమ్మాయి జాతీయస్థాయిలో గోల్ప్ క్రీడాకారిణిగా రాణించింది. కరాటేలోనూ బ్లూ బెల్ట్ సాధించింది. ఈ అమ్మాడు ఇంటర్ చదువు ముగిసి సెలవుల్లో ఉన్న సమయంలో పాకెట్ మనీ కోసం డబ్బులకు ఇబ్బంది అయిందట. అదే సమయంలో కన్నడ సినిమా కోసం హీరోయిన్‌గా ఆడిసన్స్ జరుగుతుండటంతో స్నేహితుల సూచన మేరకు వెళ్లింది. దీంతో ‘గిల్లి’ అనే కన్నడ మూవీలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.హీరోయిన్‌గా కేవలం తనకు కాలేజీ సెలవులు ఉన్న వరకే నటిస్తానని షరతు పెట్టి ఆ మూవీలో నటించిన రకుల్.. వేసవి సెలవులు ముగిసిన వెంటనే డిగ్రీ కాలేజీలో జాయిన్ అయింది. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తడంతో ఓవైపు డిగ్రీ చదువుతూనే సినిమాల్లో యాక్ట్ చేసింది. అదే సమయంలో టాలీవుడ్‌లో ‘కెరటం’ మూవీలో నటించింది. ఆ తర్వాత 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో నిలదొక్కుకుంది రకుల్. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇదే సమయంలో ఆమెకు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో ఆఫర్లు రావడంతో అటు చెక్కేసిందీ పంజాబీ భామ. అలా పాకెట్ మనీ కోసం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ అగ్రతారల సరసన నిలిచిపోవడం విశేషమే మరి.


Also Read..

Rakul Preet Singh: రకుల్‌ను చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే.. ఇలా ఎలా మారిపోయిందబ్బా..!


Advertisement

Next Story

Most Viewed