- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakul Preet Singh: నా జీవితంలో అవి ఊహించని పరిణామాలు.. ఆసక్తికరంగా రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
దిశ, సినిమా: రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ వరుస చిత్రాలతో సందడి చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనతికాలంలోనే మంచి పాపులరిటీతో పాటు స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన కూడా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇటీవల ‘భారతీయుడు 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘నాకు ప్రజెంట్ దక్కుతున్న ప్రేమకు.. అదృష్టం అనే పదం కరెక్టో కాదో నాకు తెలియదు. నేను సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిని కానప్పటికీ.. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు, సపోర్ట్‌కు ఎంతో రుణపడి ఉంటాను. అతి తక్కవ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు లభించింది. డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలో పని చేస్తూ.. డిఫరెంట్ వ్యక్తుల నుంచి కొత్త విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తెలిసి జీవితంలో ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. వాటంతట అవి జరిగి.. జీవితంలో ఒక్కో మెట్టు ఎదగటానికి సహాయం చేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.