ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రకుల్.. ఇద్దరూ కలిసి అలా దర్శనం (వీడియో)

by sudharani |   ( Updated:2023-06-13 13:40:11.0  )
ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రకుల్.. ఇద్దరూ కలిసి అలా దర్శనం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, సెక్సీ లుక్స్‌తో, ఫిట్ నెస్ బాడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. రకుల్ బాలీవుడ్‌కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు రిలీషన్‌లో ఉన్నట్లు గతంలోనే చెప్పిన ఈ జంట.. సమయం దొరికినప్పుడల్లా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే మరో సారి కెమెరాకు చిక్కారు ఈ జంట.

ప్రముఖ నిర్మాత మధు మంతెన, ఐరా త్రివేదిల పెళ్లి వేడుకలలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన ప్రియుడు జాకీ భగ్నానితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్లి వేడుకలో సందడి చేసిన ఈ జంట.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లవ్లీ కపుల్స్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story