Rakhi Sawant: అలా నడుస్తూ మలైకాను ఎగతాళి చేసిన రాఖీ.. వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-06-13 15:00:15.0  )
Rakhi Sawant: అలా నడుస్తూ మలైకాను ఎగతాళి చేసిన రాఖీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : వివాదాస్పద నటి రాఖీ సావంత్ తన వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి సహ నటి మలైకా అరోరాను టార్గెట్ చేసిన రాఖీ.. ఆమె నడక, ఫిట్‌నెస్‌ను ఇష్టపడాతానని చెబుతూనే దారుణంగా ఎగతాళి చేసింది. విషయానికొస్తే.. రీసెంట్‌గా పింక్ కలర్ స్పోర్ట్స్ బ్రా, పర్పుల్ కలర్ ప్యాంట్, రెడ్-పింక్ స్పోర్ట్స్ షూస్ ధరించి జిమ్‌లో కసరత్తులు చేసి బయటకొచ్చిన ఆమె.. బయట ఉన్న ఫొటోగ్రాఫర్ల ముందు నానా హంగామా చేసింది. స్పోర్ట్స్ డ్రెస్ వెసుకున్నపుడు మలైక ఎలా నడుస్తుందో చూపిస్తూ ‘డక్ వాక్’ అంటూ కామెంట్ చేసింది. అంతటితో ఆగకుండా తన నడుమును ఎలా తిప్పుతుందో కూడా చూపిస్తూ దారుణంగా ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రాఖీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీ అమ్మ ఇటీవల మరణించింది. మీరు ఆ బాధలో ఉన్నట్లు అనిపించడం లేదు. నీకు పిచ్చెక్కినట్లుంది’ అంటూ తిట్టిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అభిమానులను పిచ్చోళ్లను చేసిన మంచు ఫ్యామిలీ.. ఇంతలా దిగజారాలా..? (వీడియో)

Advertisement

Next Story