రాఖీ నాతో అసభ్యంగా ప్రవర్తించింది: ఆదిల్ ఖాన్

by sudharani |   ( Updated:2023-02-05 13:09:20.0  )
రాఖీ నాతో అసభ్యంగా ప్రవర్తించింది: ఆదిల్ ఖాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ దుర్రానీ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ బంధం మూడునాళ్ల ముచ్చటే అయింది. దాదాపు విడిపోయే స్టేజ్‌కి వచ్చింది. రీసెంట్‌గా ఆదిల్‌ని అనవసరంగా హీరోను చెయ్యకండి. అతను ఒక అబద్దాల కోరు అని తెలిపింది రాఖీ. ఇక రాఖీ సావంత్ చీటింగ్ ఆరోపణలపై స్పందించిన ఆదిల్..

'తను నా పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించింది. నేను ఒక మహిళ గురించి మాట్లాడకపోతే తప్పు చేశానని అర్థం కాదు. నా మతాన్ని గౌరవిస్తాను. స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నాను. కాబట్టి నేను ఏమి చేస్తున్నానో, ఆమె నాతో ఏమి చేసిందో తెలిస్తే ఎవరూ నోరు విప్పరు. ప్రతి రోజూ ఆదిల్ చెడ్డ వాడు, చెడ్డవాడు అని ప్రజలకు చెప్పాలనుకోవడమే ఆమె పని' అని చెప్పుకొచ్చాడు.



Advertisement

Next Story