బ్రేకింగ్: రజినీకాంత్ కూతురి ఇంట్లో చోరీ

by Satheesh |   ( Updated:2023-03-20 04:01:10.0  )
బ్రేకింగ్: రజినీకాంత్ కూతురి ఇంట్లో చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ స్టార్ హీరో రజినీకాంత్ కూతురు ఇంట్లో చోరీ జరిగింది. చెన్నైలోని రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఐశ్వర్య ఇంట్లో ఉన్న బంగారం, నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన ఐశ్వర్య రజినీకాంత్ చెన్నై తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తేనాంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read..

నాగచైతన్య రెండో పెళ్లిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసా?

Advertisement

Next Story