40 ఏళ్ల కిందటి బైక్ పై కనిపించిన రజనీకాంత్.. పిక్ రిలీజ్ చేసిన ఏవీఎం!

by Anjali |   ( Updated:2024-03-05 16:49:05.0  )
40 ఏళ్ల కిందటి బైక్ పై కనిపించిన రజనీకాంత్.. పిక్ రిలీజ్ చేసిన ఏవీఎం!
X

దిశ, సినిమా: ప్రముఖ పురాతన నిర్మాణ సంస్థ ఏవీఎం తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రేర్ ఫొటోను విడుదల చేశారు. ఈ సంస్థ తమిళంతో పాటు సౌత్ లాంగ్వేజ్ లలో 90 ఏళ్లుగా సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కాగా 90 ఏళ్లు పురస్కరించుకుని ఏవీఎం కంపెనీ తమ సినిమాల్లో ఉపయోగించిన వాహనాలను తాజాగా ప్రదర్శిస్తోంది. ఈ కంపెనీ ఎంతో మంది గొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది.

అయితే సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్-రాధ నటించిన బయుమ్ పులి సినిమా ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఏవీఎం వారికి ఈ మూవీ 126 వ సినిమా. కాగా రజనీ ఈ సినిమాలో వాడిన సుజుకీ బైక్ ఏవీఎం సంస్థ 40 ఏళ్ల తర్వాత కూడా మెయింటైన్ చేయడం గమనార్హం. అయితే ఈ సంస్థ ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో రజనీ వాడిన బైక్ పిక్స్ రిలీజ్ చేశాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ ఈ బైక్ పై స్టైలిష్ ఫొటోలకు ఫోజులిచ్చారు. తాజాగా ఏవీఎం కంపెనీ రజనీకాంత్ 40 ఏళ్ల కిందటి సుజుకీ బైక్ పై కూర్చుని దిగిన పిక్ సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story