ర‌జ‌నీ, అమితాబ్‌ కాంబోలో పాన్ ఇండియా మూవీ.. బిగ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నాని

by samatah |   ( Updated:2023-08-17 05:59:28.0  )
ర‌జ‌నీ, అమితాబ్‌ కాంబోలో పాన్ ఇండియా మూవీ.. బిగ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నాని
X

దిశ, సినిమా : తమిళ్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌, అమితాబ్‌ బ‌చ్చన్ కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ అయ్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోని ఓ ముఖ్యమైన పాత్రలో టాలీవుడ్‌ హీరో నాని కూడా క‌నిపించ‌బోతున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. కాగా నాని ఈ ఆఫర్ తిర‌స్కరించిన‌ట్లు సమాచారం. అది నెగెటివ్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్ కావ‌డమే ఇందుకు కారణమట. దీంతో ఈ ఆఫ‌ర్ శ‌ర్వానంద్‌ను వరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ప్రముఖ హీరోలతో క‌లిసి న‌టించే అవ‌కాశం కావ‌డంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా శ‌ర్వానంద్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Read More: ఆ అంశంపై మరోసారి స్పందించిన రేణు దేశాయ్.. అసలు నిజం అదే అంటూ షాకింగ్ పోస్ట్

Advertisement

Next Story