మతంపై రాజమౌళి కాంట్రవర్శి కామెంట్స్..? మద్దతు ఇస్తున్న స్టార్ హీరోయిన్

by sudharani |   ( Updated:2023-02-18 14:11:18.0  )
మతంపై రాజమౌళి కాంట్రవర్శి కామెంట్స్..? మద్దతు ఇస్తున్న స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శక ధీరుడు, సినీ దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ఆధరణ పొందుతున్న డైరెక్టర్స్‌లో ముందుంటాడు మన దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే.. ఇటీవల రాజమౌళి మతం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాను కూడా గుళ్లు, గోపురాలు తిరిగేవాడినని.. తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించి చర్చికి వెళ్లినట్లు తెలిపాడు. అయితే తాను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మతం అనేది దోపిడీలా అనిపించిందని రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి కాంట్రవర్సీ కాగా.. వాటికి సమర్థిస్తూ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రాజమౌళికి మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా స్పందించారు..

''రాజమౌళి సర్ మాటలకు అంతలా స్పందించ నవసరం లేదు. మేము దేవుళ్లను పూజిస్తాము. అలా అని ప్రతి చోటా దేవుడు జెండా పట్టుకోకూడదు. కొన్ని సార్లు మన చర్యలు మాటల కంటే బిగ్గరగా ఉంటాయి. గర్వించదగిన హిందువుగా అన్ని రకాల దాడులు, శత్రుత్వం, ట్రోలింగ్, భారీ మొత్తంలో ప్రతికూలతలను పిలుస్తుంది. మేము అందరి కోసం సినిమాలు చేస్తాము. మేము కళాకారులు ముఖ్యంగా హాని కలిగి ఉంటాము. అయినా మాకు ఎవరి మద్దతు లభించదు కాబట్టి.. మాకు మేము పూర్తిగా మద్దతు ఇచ్చుకుంటాము. వర్షంలో మంటలా ఉన్న రాజమౌళి సార్‌ను గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏ మాత్రం సహించను. ఆయనొక మేధావి, జాతీయవాది అత్యున్నత స్థాయి కలిగిన యోగి. ఆయనను కలిగి ఉన్నందుకు మనం గర్వించాలి..'' అంటూ తన పూర్తి సపోర్ట్ రాజమౌళికే అని తెలిపింది.

Also Read...

అదిరిపోయిన 'మాధవే మధుసూదన' మోషన్ పోస్టర్.. రిలీజ్ చేసిన కింగ్

Advertisement

Next Story