RAJAMOULI-MAHESH BABU రాజమౌళి- మహేష్ బాబు చిత్రంలో తమిళ్ స్టార్ హీరో.. పూనకాలే అంటున్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-07-24 10:46:03.0  )
RAJAMOULI-MAHESH BABU రాజమౌళి- మహేష్ బాబు చిత్రంలో తమిళ్ స్టార్ హీరో.. పూనకాలే అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రేక్షకులందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రూ. 1000 కోట్లు ఖర్చు చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా జక్కన్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారట. ఇది మాత్రమే కాకుండా పార్ట్-3 కూడా తీసే చాన్సెస్ ఉన్నాయట. ఇదిలా ఉండగా..

సూపర్ స్టార్ చిత్రంలో తమిళ్ హీరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారట. మరీ ఆ కథానాయకుడు ఎవరో కాదు.. తమిళ్ అగ్ర హీరో అయిన కమల్ హాసన్. మొన్నటివరకు పలు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ కమల్ హాసన్ నటించిన.. రీసెంట్ గా తెరకెక్కిన కల్కీ, భారతీయుడు-2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రాజమౌళి తన సినిమాలో తీసుకుందామనుకుంటున్నారట.

కీలక పాత్రలో ఎంపిక చేసుకున్నప్పటికీ మరీ హీరో అన్నయ్య రోల్ లోనా? లేక విలన్‌గా నటిస్తాడా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇటు సూపర్ స్టార్.. అటు లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరి కలయికలో మూవీ అంటే పూనకాలే అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story