భార్యతో ఇదే పనా.. సినిమాలు చేసేది లేదా ఇక.. రాజమౌళిపై నెట్టింట దారుణమైన ట్రోల్స్

by sudharani |
భార్యతో ఇదే పనా.. సినిమాలు చేసేది లేదా ఇక.. రాజమౌళిపై నెట్టింట దారుణమైన ట్రోల్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన.. బాక్సాఫీస్‌కు ఎన్నో భారీ హిట్‌లను అందించాడు. అంతే కాకుండా ‘బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ప్రంపచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రాజమౌళి రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినప్పుడు ఈయన రాసుకున్న ప్రతి కథను రమాకు వినిపించేవారట. దీంతో ఆమె కథ ఎలా ఉందో చెప్పడమే కాకుండా.. అందులో కొన్ని మార్పులు సైతం చేసేదట. ఈ క్రమంలోనే వీరి బంధం మరింత బలపడటంతో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ఏ సినిమా ఈవెంట్ అయిన రమా లేకుండా రాజమౌళి వెళ్లరు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అంతే కాకుండా వీరు సరదాగా ఎంజాయ్ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి, రమా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

‘అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే’ అనే సాంగ్‌కు రాజమౌళి, రమా ఇద్దరు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. కొందరూ ‘ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన జంట’ అని పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ మాత్రం.. ‘భార్యతో డ్యాన్స్‌లు వేసుకుంటా ఉంటావా.. సినిమాలు చేసేది లేదా’ అంటూ నెగిటివ్‌గా ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed