Lavanya-Raj Tarun: లైవ్ డిబేట్‌‌లో ఆయన్ను చెప్పుతో కొట్టిన లావణ్య.. వీడియో వైరల్

by Anjali |
Lavanya-Raj Tarun: లైవ్ డిబేట్‌‌లో ఆయన్ను చెప్పుతో కొట్టిన లావణ్య.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: గత నెల రోజుల నుంచి రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ సంచనంగా మారింది. ప్రేయసి లావణ్య ఫ్రూప్‌తో సహా రోజుకో నిజం బయటపెడుతూ.. రాజ్ తరుణ్ ‌కు చుక్కలు చూపిస్తుంది. నిన్న ‘తిరగబడరా సామీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజ్‌ను లావణ్య గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి హీరోకు తెగ చిరాకు తెప్పించారు. పోలీసుల బందోబస్తు నిర్వహించిన కూడా లావణ్య కూడా అక్కడికి చేరుకుని ‘నా రాజ్ తరుణ్ ను చూడాలి. ఆయనతో మాట్లాడనివ్వండి’ అంటూ ఆందోళన చేపట్టింది. తర్వాత మీడియా సమావేశంలో రాజ్ తరుణ్ ఓ హీరోయిన్‌తో ప్రైవేట్‌గా ముద్దు పెడుతోన్న ఓ ఫొటోను లావణ్య బయటపెట్టింది.

ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇన్ని డేస్ బయటికి రాని తరుణ్ కనిపించి.. లావణ్య మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. దీంతో కొంతమంది లావణ్యకు మద్ధతు పలుకగా.. మరికొంమంది ఆమెకు అపోజిట్‌గా మాట్లాడుతున్నారు. పలువురు జనాలు రాజ్ తరుణ్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన టీవీ డిబేట్ లైవ్ షోలో లావణ్య.. శేఖర్ భాషాను చెప్పుతో కొట్టింది. ఆయన మాటలకు ఒక్కసారిగా ఊగిపోయిన లావణ్య కుర్చీలోంచి లేచి.. శేఖర్‌ను చెప్పుతో కొట్టింది. చెప్పుతో కొట్టిన లావణ్యను శేఖర్ భాష చేయితో నెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story