రాజ్ తరుణ్ పుట్టిన రోజు స్పెషల్.. న్యూ మూవీ అనౌన్స్!

by Anjali |   ( Updated:2023-05-11 04:11:58.0  )
రాజ్ తరుణ్ పుట్టిన రోజు స్పెషల్.. న్యూ మూవీ అనౌన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రేక్షకుల మనసు దొచుకున్నాడు. ఈ తర్వాత సినిమా ‘చూపిస్తా మామ’, ‘కుమారి 21 ఎఫ్’ పలు చిత్రాల్లో నటించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హీరో ప్రస్తుతం మోహన్ వీరంకి దర్శకత్వంలో ‘‘స్టాండప్ రాహూల్’’ అనే కొత్త మూవీలో నటిస్తున్నాడు. తరుణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఈ పోస్టర్‌ను చూస్తుంటే హీరో నవ్వుతూ సైడ్ యాంగిల్ ప్రజల మధ్య నిల్చొని మైకు పట్టుకుని మాట్లాడుతున్నట్లుగా డిజైన్ చేశారు. ఈ చిత్రానికి కథానాయిక వర్ష బొల్లమ్మ. అలాగే కంచరపాలెం ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే నేడు రాజ్ తరుణ్ 31 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

Also Read..

నేడు ‘కేరళ స్టోరీ’ సినిమాతో దూసుకుపోతున్న అదా శర్మ పుట్టిన రోజు..

Advertisement

Next Story