క్రైం, థ్రిల్లింగ్ సీన్స్‌తో 'రహస్య' టీజర్

by sudharani |   ( Updated:2023-10-05 05:24:28.0  )
క్రైం, థ్రిల్లింగ్ సీన్స్‌తో రహస్య టీజర్
X

దిశ, వెబ్‌డెస్క్ : నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్న చిత్రం 'రహస్య'. క్రైం, మిస్టరీ, థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి 52 సెకన్ల నిడివి గల టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ఉండే సన్నివేశాలు, సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంతుచిక్కని ఓ క్రైంను పోలీసులు ఏవిధంగా ఛేదించారు? అనేది టీజర్‌లో చూపించే విధానం సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. దీంతో ఈ మూవీ సరికొత్త డిఫరెంట్ స్టోరీతో మంచి హిట్ కొట్టబోతోందని ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.

Advertisement

Next Story