రాఘవ లారెన్స్ న్యూ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

by sudharani |
రాఘవ లారెన్స్ న్యూ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘రాక్షసుడు, ఖిలాడీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన కె.ఎల్. యూనివర్శిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ.. ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అది కూడా తమ సంస్థలో ఇంతకు ముందు ‘రాక్షసుడు, ఖిలాడీ’ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతోనే మరోసారి ప్రాజెక్ట్ చేయనున్నారు ఈ నిర్మాత. బిగ్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో డ్యాన్సర్, నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌గా, మానవతావాదిగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించనున్నారు మేకర్స్.

రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ న‌వంబ‌ర్‌లో ప్రారంభించి 2025 స‌మ్మర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మూవీకి సంబంధించిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ మీద షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ ఇమేజ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జయిట్‌మెంట్‌ వర్డ్స్ ప్రాజెక్టుకు ఇన్‌స్టంట్‌గా హైప్‌ పెంచుతున్నాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్.

Advertisement

Next Story