Chandrayaan-4 : చంద్రయాన్‌-4కు కేంద్ర కేబినెట్ గ్రీన్​ సిగ్నల్

by Y. Venkata Narasimha Reddy |
Chandrayaan-4  : చంద్రయాన్‌-4కు కేంద్ర కేబినెట్ గ్రీన్​ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : వీనస్ ఆర్బిటర్‌ మిషన్‌, గగన్‌యాన్‌, చంద్రయాన్ -4 మిషన్ల విస్తరణకు రూ.2,104 కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. చంద్రయాన్‌-4 ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని, శిలలను భూమి పైకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లో ఎర్త్ ఆర్టిట్‌లో 30 టన్నుల పేలోడ్‌లను ఉంచేందుకు నెక్ట్స్‌ జనరేషన్ లాంఛ్‌ వెహికల్‌ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ చంద్రయాన్ 4కు ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరించారు. దేశంలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి జమిలి ఎన్నికలకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.

ఎన్‌పీకే ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న ఘర్షణతో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల బారినపడకుండా ఉండేందుకు సబ్సిడీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రధాన మంత్రి జంజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి రూ.79,156 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed