ICAR(CTRI) JOB NOTIFICATION: రాజమహేంద్రవరంలో.. యంగ్ ప్రొఫెషనల్ జాబ్ ఓపెనింగ్స్!

by Geesa Chandu |
ICAR(CTRI) JOB NOTIFICATION: రాజమహేంద్రవరంలో.. యంగ్ ప్రొఫెషనల్ జాబ్ ఓపెనింగ్స్!
X

దిశ, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్(ICAR) కు చెందిన సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(Central Tobacco Research Institute)లో.. యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్(Jobs) కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 07

యంగ్ ప్రొఫెషనల్-I: 04

యంగ్ ప్రొఫెషనల్-II: 02

జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF): 01

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు నెట్, గేట్ మార్కులు(స్కోర్) ఉండాలి.

వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు నెలకు రూ.30,000; యంగ్ ప్రొఫెషనల్-II పోస్టుకు నెలకు రూ. 42,000; జూనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000 నుంచి రూ.42,000. ఉంటుంది.

ఎంపిక: విద్యార్హత, వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience), షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు: డైరెక్టర్, ఐసీఏఆర్-సీటీఆర్ఐ(ICAR-CTRI), రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు కొరియర్/పోస్టు ద్వారా పంపవలసి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2024

వెబ్ సైట్: https://ctri.icar.gov.in/

Advertisement

Next Story