- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Johnny Master: జానీ మాస్టర్ వివాదంలో కీలక పరిణామం.. తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయగా తాజాగా సీన్ లోకి మహిళా కమిషన్ ఎంటర్ అయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీపై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా సంఘం సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేసిన తరుణంలో మరోవైపు మహిళా సంఘం కమిషన్ కు ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై ఆరోపణల వ్యవహారంలో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కాగా జానీ మాస్టర్ విషయంలో ఓ బాధితురాలు ముందడుగు వేయగా ఆ వెంటనే మరో యాక్టర్ పూనం కౌర్ ఏకంగా ఓ ప్రముఖ దర్శకుడిపై తాను గతంలో ఫిర్యాదు చేసినా సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. ఈ నేపథ్యంలో తీగ లాగితే డొంక కదిలిన చందంగా జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతుందా లేకా షరా మామూలే అన్నట్లు అంతా సర్దుకుపోతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Read More..