ఫ్రెంచ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రాధిక.. న్యూ జర్నీ మొదలైందంటూ పోస్ట్

by Prasanna |   ( Updated:2023-10-25 09:54:00.0  )
ఫ్రెంచ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రాధిక.. న్యూ జర్నీ మొదలైందంటూ పోస్ట్
X

దిశ, సినిమా : సీనియర్ నటి రాధిక తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు విదేశీ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్న నటి.. ‘సినీ కెరీర్‌లో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ మూవీలో నటిస్తున్నా. ఫస్ట్ డే షూటింగ్‌లోనూ పాల్గొన్నాను. ఈ సరికొత్త అనుభూతి నాకెంతో ఆనందాన్నిస్తుంది. నా భర్త శరత్ కుమార్‌తోపాటు అభిమానులు నన్నెంతో ప్రోత్సాహించారు. అందరికీ థాంక్స్’ అంటూ షూటింగ్ పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రాధికకు కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Advertisement

Next Story