Anant Ambani-Radhika:మెడలో నల్లపూసల దండతో కనిపించిన రాధిక మర్చంట్.. ఆకట్టుకుంటోన్న అంబానీ కోడలి సంప్రదాయ లుక్

by Anjali |   ( Updated:2024-08-01 04:18:26.0  )
Anant Ambani-Radhika:మెడలో నల్లపూసల దండతో కనిపించిన రాధిక మర్చంట్.. ఆకట్టుకుంటోన్న అంబానీ కోడలి సంప్రదాయ లుక్
X

దిశ, సినిమా: చరిత్రలో నిలిచిపోయేలా ఇటీవలే.. ముఖేష్ అంబానీ తన చిన్నకుమారైన అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి ప్రముఖ వ్యాపార వేత్తలు, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై తెగ సందడి చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ కు లక్షల్లో, కోట్లల్లో విలువ చేసే బహుమతులను కూడా సమర్పించారు. అనంత్ అంబానీ కూడా తమ ఫ్రెండ్స్‌కు 5 కోట్ల రూపాయలతో వాచ్‌లు కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా..

అంబానీ ఫ్యామిలీ అంతా కలిసి పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పాల్గొని తెగ సందడ చేశారు. నూతన వధూవరులైన అనంత్ అంబానీ అండ్ రాధికా మర్చంట్ మరింతగా అట్రాక్షన్‌గా నిలిచారు. రాధికా ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి.. మెడలో సింపుల్‌గా నల్లపూసల దండ వేసుకుని కనిపించింది. ఆకర్షనీయమైన బ్యాగ్ వైట్ క్రాస్ బాడీ స్టింగ్ బ్యాగ్‌తో మేకప్ లేకుండా చక్కగా ఉంది. మెడలో నల్లపూసల దండ వేసుకోవడంతో జనాలంతా సంప్రదాయబద్దంగా చాలా చక్కగా ఉందంటూ రాధికపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లితో రాధికా మర్చంట్ డైమండ్ నగలతో అందరిని ఆకట్టుకుంది. వీరితో పాటు ముఖేష్ అంబానీ అండ్ నీతా అంబానీ కూడా ఒలంపిక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ పారిస్ 2024 ఒలంపిక్స్‌లో సందడి చేసిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





Advertisement

Next Story