- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు మార్చుకున్న ప్రభాస్.. వేణు స్వామి చెప్పిందే చేస్తున్నాడా..?
దిశ, సినిమా: వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఇక తాజాగా ఆయన తదుపరి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ అయిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి ‘ది రాజాసాబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది మూవీ టీమ్.ఇక ఈ లుక్ లో లుంగీలో ప్రభాస్ అదిరిపోయాడు. అయితే డార్లింగ్ సూపర్‌గా ఉన్నప్పటికి.. పోస్టర్ లో ప్రభాస్ పేరు లో జరిగిన మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ పేరులో ఒక ఎస్ అదనంగా చేర్చారు. ఇది చూసిన నెటిజన్లు ‘ ప్రభాస్ కూడా న్యూమరాలజీ ని ఫాలో అవుతున్నాడా..’ అంటూ ‘వేణు స్వామి చెప్పింది వింటున్నారా ఏంటీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది.. ‘ కేవలం మిస్టేక్ వల్ల ప్రభాస్ పేరులో మరో ఎస్ పడింది’ అని వారు తెలిపారు. ఇక దీంతో ‘ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ పేరును సరిగా రాయలేదు మూవీ ఏం చేస్తారు’ అంటూ మళ్ళీ ట్రోల్స్ మొదలెట్టారు. ‘కవరింగ్ బాగుంది’ అని నవ్వుకుంటున్నారు. అంతేకాదు ‘అసలు ఈ లుక్ లో కనిపిస్తుంది ప్రభాస్ రియల్ మొహమేనా..? లేక అది ఏఐ జనరేటెడ్ మొహంలా ఎడిటింగ్ చేశారా’ అని కూడా అనుమానం వ్యాక్తం చేస్తున్నారు.