క్వీన్ ఆఫ్ మాసెస్.. సీరియస్ లుక్‌లో అదరగొడుతున్న కాజల్ (పోస్టర్ రిలీజ్)

by sudharani |   ( Updated:2024-04-24 12:36:36.0  )
క్వీన్ ఆఫ్ మాసెస్.. సీరియస్ లుక్‌లో అదరగొడుతున్న కాజల్ (పోస్టర్ రిలీజ్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల బాలకృష్ణ మూవీ ‘భగవంత్ కేసరి’లో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘సత్యభామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల రిలీజైన టీజర్‌కు విశేష స్పందన లభించింది.

ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘‘ది క్వీన్ ఆఫ్ మాసెస్’ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎంఎస్ కాజల్ అగర్వాల్ మునుపెన్నడూ లేని విధంగా పెద్ద స్క్రీన్‌లపై తన ఫైర్‌ను చూపించనుంది. మే 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘సత్యభామ’ రిలీజ్ కానుంది’ అంటూ తెలిపారు. కాగా.. ‘సత్యభామ’లో కాజల్ పవర్ ఫుల్ ఏసీపీ పాత్రలో లేడి సివంగిలా కనిపించనుండటంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

Read More

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల.. బయటపడ్డ బాయ్ ఫ్రెండ్ ఫుల్ డిటేల్స్!

Advertisement

Next Story