Sunny Leone : ‘QG’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ముఖం నిండా రక్తంతో సన్నీ లియోన్ పోస్టర్

by sudharani |   ( Updated:2024-07-30 11:02:28.0  )
Sunny Leone : ‘QG’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ముఖం నిండా రక్తంతో సన్నీ లియోన్ పోస్టర్
X

దిశ, సినిమా: సన్నీ లియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్ (QG)’. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిల్మినాటి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు ఎంతో ఆకట్టుకోగా.. ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఎంతో వైలెంట్‌గా ఉన్న ట్రైలర్‌లో ప్రియమణి, సన్నీ లియోన్, జాకీ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ అదరహో అనిపించి.. మూవీపై అంచనాలు పెంచాయి.

అయితే.. నిజానికి ఈ సినిమా జూలైలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అయింది. ప్రజెంట్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది సన్నీ లియోన్. ‘ఆగస్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది’ అని తెలిసిన ఈ పోస్టర్‌లో.. ముఖం నిండా రక్తంతో సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటుంది సన్నీ.

Advertisement

Next Story