puri jagannadh: వరుస చిత్రాలతో వచ్చేస్తున్న పూరి జగన్నాథ్

by Prasanna |   ( Updated:2023-04-23 10:17:25.0  )
puri jagannadh: వరుస చిత్రాలతో వచ్చేస్తున్న పూరి జగన్నాథ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్‌ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డుల గురించి జోరుగా చర్చలు నడుస్తాయి. అలా దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరికి హిట్ ఇచ్చాడు. అలాగే చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్. గతేడాది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్ కావడంతో పూరీకి కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు యంగ్ హీరోస్ రామ్ పోతినేని, విశ్వక్ సేన్‌లతో సినిమాలు తీసి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. మొదట విశ్వక్ సేన్‌‌తో సినిమా ఆగస్ట్‌ నుంచి మొదలుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్‌పై వర్క్ జరుగుతుందట. ఈ న్యూస్‌ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

Also Read..

జబర్దస్త్ స్టార్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు?

Advertisement

Next Story