పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

by Hamsa |   ( Updated:2023-03-27 11:54:43.0  )
పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్‌లో గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే పునీత్ చనిపోయే నాటికి ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. పునీత్‌పై అభిమానంతో ఆయన లేకున్నా దర్శ నిర్మాతలు పెడింగ్‌లో ఉన్న చిత్రాలను పూర్తి చేశారు. కాగా, అప్పు చివరిగా నటించిన చిత్రం ‘గంధడ గుడి’. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరీని పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష తెరకెక్కించారు. అయితే గతేడాది పునీత్‌ వర్ధంతి (అక్టోబర్‌ 22) సందర్భంగా విడుదలైన ‘గంధడ గుడి’ ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో పూనీత్ జయంతి సందర్భంగా మార్చి 17న స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed