ఈ సినిమా నన్ను ఏడిపించింది.. ఒత్తిడికి గురి చేసింది

by Nagaya |   ( Updated:2023-06-05 09:07:33.0  )
ఈ సినిమా నన్ను ఏడిపించింది.. ఒత్తిడికి గురి చేసింది
X

దిశ, సినిమా: అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’ చిత్రంపై ప్రముఖ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా ముంబైలో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించగా పరిశ్రమకు చెందిన పలువురు చిత్రనిర్మాతలు, నటీనటులు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన శేఖర్.. ‘నన్ను ఆకర్షించని అనురాగ్ సినిమాని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇది నన్ను ఏడిపించింది. చాలా ఆశ్చర్యపరిచింది. ఒత్తిడికి గురి చేసింది. సినిమాను నిజంగా ఆస్వాదించాను. ఎంజాయ్ అనే పదం కొన్ని చిత్రాలకు ఉపయోగించడం చాలా కష్టమైనది. కాబట్టి ఇది మనోహరమైన చిత్రం’ అంటూ మూవీ యూనిట్ మొత్తాన్ని ప్రశంసించాడు.

Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పరువు తీసిన మేనేజర్.. అసలేం జరిగిదంటే?

Advertisement

Next Story