ప్లాంట్‌మాన్‌ చిత్రం సూపర్‌హిట్‌.. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌..నిర్మాత

by Indraja |
ప్లాంట్‌మాన్‌ చిత్రం సూపర్‌హిట్‌.. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌..నిర్మాత
X

దిశ వెబ్ డెస్క్: కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌ దర్శకుడు పన్నా రాయల్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ప్లాంట్‌ మాన్‌’. కె.సంతోష్‌బాబు దర్శకత్వంలో చంద్రశేఖర్‌, సోనాలి జంటగా సైంటిఫిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ విజయంసాధించాడనికి కారకులైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడారు. మొదటగా తన గురువు బి.ఎ.రాజును గుర్తుచేసుకుంటూ.. ఈ రోజు బి.ఎ.రాజుగారి పుట్టినరోజని.. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు తమకు ఉంటాయంటూ.. ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

బి.ఎ.రాజు కాలింగ్‌ బెల్‌ నుంచి తనను ఎంతో సపోర్ట్‌ చేశారని.. ఇప్పుడు ఈ బేనర్‌లో సినిమా చేసానని తెలిస్తే ఎంతో సంతోషంగా ఫీల్‌ అయ్యేవారని భావోద్వేగానికి గురైయ్యారు. అనంతరం డైరెక్టర్‌గా తాను అందరికీ పరిచయమే అని.. ఇప్పుడు నిర్మాతగా మారి తాను చేసిన మొదటి సినిమా ప్లాంట్‌ మాన్‌ అన్నారు. ఒక చిన్న సినిమాగా ‘ప్లాంట్‌ మాన్‌’ను చేశాము. అయినా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి చిన్న సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేశారని.. రిజల్ట్‌ మాత్రం అల్టిమేట్‌గా ఉందన్న ఆయన ఇలాంటి రెస్పాన్స్‌ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని ఉందని తెలిపారు. ‘ప్లాంట్‌ మాన్‌’ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ముఖ్య కారణమని. ఇంత పెద్ద సక్సెస్‌ తాను ఊహించలేదని హర్షం వ్యక్తం చేశారు. సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తాను ధన్యవాదాలు తెలియ చేశారు.

Advertisement

Next Story