సమంత సినిమాపై నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2022-12-24 03:36:40.0  )
సమంత సినిమాపై నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఓ వ్యాధితో బాధపడుతూనే రెండు సినిమాలు పూర్తి చేసింది. 'యశోద' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో మంచి రెప్పాన్స్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరిలో థియేటర్స్‌లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా చిత్ర నిర్మాత నీలిమ గుణని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. అసలు 'శాకుంతలం' ను 3D లోనే ఎందుకు చూడాలి అని నీలిమన గుణను టాగ్ చేశాడు. దీనికి నీలిమ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. శాకుంతలం అందమైన ప్రేమ కథ. ప్రకృతిఒడిలో సాగే స్టోరీ. ఈ ప్రేమ కథ జంతువులు, ప్రక‌ృతిలో ప్రేమించబడింది. ప్రకృతితో శ‌కుంత‌ల ఒదిగిపోయిన తీరు.. దుష్యంతుడి అద్భుత‌మైన ప్రేమ క‌థ‌. అత‌ని పరాక్రమం వంటి వాటిని త్రీడీ టెక్నాల‌జీలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి'' అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు సినిమా నుండి ఏదైనా అప్డేట్స్ ఇవ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story