బ్రేకింగ్: నిర్మాత నవీన్ ఎర్నేనికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

by Satheesh |   ( Updated:2023-04-21 13:48:14.0  )
బ్రేకింగ్: నిర్మాత నవీన్ ఎర్నేనికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయనకు బీపీ ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, ప్రస్తుతం ప్రొడ్యూసర్ నవీన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ సినిమాల్లో వచ్చిన డబ్బును పక్కదారి పట్టించిందన్న ఆరోపణల నేపథ్యంలో గత మూడు రోజులుగా మైత్రి మూవీస్ ఆఫీస్, ప్రొడ్యూసర్ నవీన్ ఇంట్లో ఐటీ అధికారులు ముమ్మురంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఐటీ దాడుల టెన్షన్‌తోనే నవీన్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Also Read...

స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం..

Advertisement

Next Story