అఖిల్‌ను కావాలనే ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2023-04-29 06:50:08.0  )
అఖిల్‌ను కావాలనే ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ అంచనాల మధ్య రిలీజైన అఖిల్ ఎజెంట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అక్కినేని అఖిల్‌ను ఆ నిర్మాత కావాలనే తొక్కేస్తున్నారని, ఆయనను ఇండస్ట్రీలో ఎదగనివ్వడం లేదంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. ఏజెంట్ సినిమాకి నిన్నటి వరకు డిస్ట్రిబ్యూటర్స్ దొరకకపోవడం చాలా అవమానకరం.అయితే ఈ రోజు పొన్నియన్ సెల్వన్ 2 సినిమా కూడా ఈరోజే వచ్చింది.ఈ సినిమాకే ఎక్కువగా థియేటర్లు ఇచ్చారు.కావాలనే ఓ బడా నిర్మాత ఏజెంట్ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆ బడా నిర్మాత చేతుల్లోనే నడుస్తుంది. అందుకే అఖిల్ మూవీకి థియేటర్స్ ఇవ్వకుండా, అఖిల్‌ను తొక్కేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Also Read..

‘ఏజెంట్’ విషయంలో అఖిల్‌కి ఫోన్ చేసి అభినందించిన స‌మంత‌

Advertisement

Next Story